'జాతరలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలి'

CTR: కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని కుప్పం డీఎస్పీ శ్రీనాథ్ పేర్కొన్నారు. గంగ జాతర బందోబస్తు పోలీస్ సిబ్బందికి సోమవారం డీఎస్పీ పలు సూచనలు ఇచ్చారు. జాతర సందర్భంగా మూడు రోజులపాటు కుప్పంలో ట్రాఫిక్ మళ్ళించడం జరుగుతుందని జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు వ్యవహరించాలన్నారు.