శ్రీరంగం క్షేత్రం వలె శ్రీ రంగనాయక స్వామి
SDPT: మర్కుక్ మండల కేంద్రంలోని శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి పుష్ప రథోత్సవం నిర్వహించి, ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ కమిటీ చైర్మన్ గుండా శ్రీనివాస్ మాట్లాడుతూ.. శ్రీ రంగనాయక స్వామి మహిమాన్వితమైనవారని, శ్రీరంగం క్షేత్రం వలె ఇక్కడ స్వామివారు కొలువయ్యారని తెలిపారు.