అధిక లోడ్‌తో వెళ్లే వాహనాలపై అధికారులు కొరడా

మన్యం: అధిక లోడ్‌తో వెళ్లే వాహనాలపై జరిమానా విధిస్తామని జిల్లా రవాణాశాఖ అధికారి దుర్గాప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. గురువారం సహాయ మోటార్ ఇన్‌స్పెక్టర్, డిపో మేనేజర్‌తో కలసి నర్శిపురం గ్రామం వద్ద తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు అతిక్రమించిన వారికి రూ.30వేలు జరిమానా విధించామని తెలిపారు. స్కూల్ పిల్లలను తీసుకువెళ్లే చోధకులు నిబంధనలు పాటించాలన్నారు.