వాల్ పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్
SRCL: అంబేడ్కర్ జయంతి వేడుకల వాల్ పోస్టర్‌ను కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆవిష్కరించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అంబేడ్కర్ జయంతి వేడుకల నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు. ఈనెల 14న షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అంబేడ్కర్ చౌక్‌లో జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరు కావాలన్నారు