ఫాగింగ్ ప్రక్రియను పరిశీలించిన అధికారి

ఫాగింగ్ ప్రక్రియను పరిశీలించిన అధికారి

NLR: నెల్లూరు నగరపాలక సంస్థ ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చైతన్య పారిశుధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా బుధవారం నాలుగవ వార్డు జాకీర్ హుస్సేన్ నగర్, మారుతీ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడ పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది అందరూ ఫీల్డ్‌లో ఉన్నారా అని చెక్ చేశారు. అనంతరం ఫాగింగ్ ప్రక్రియను పరిశీలించారు. స్వచ్ఛ నెల్లూరుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.