గుమ్మడిదలలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం
SRD: గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని అన్నారం, నల్లవల్లి, కానుకుంట గ్రామాల్లో వానాకాలం వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ పరమేశం శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు రైతులు ప్రభుత్వ నిర్ణయించిన మద్దతు ధరకు తమ వరి ధాన్యాన్ని విక్రయించాలని సూచిస్తూ, కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.