రోడ్లపై చెత్త చెదారం.. ఇబ్బంది పడుతున్న ప్రజలు

రోడ్లపై చెత్త చెదారం.. ఇబ్బంది పడుతున్న ప్రజలు

SKLM: మండల కేంద్రం సారవకోట కరుణాల వీధి ప్రధాన రహదారిపై కాలువల్లో తీసిన చెత్త చెదారం రోడ్డుపై వేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలో పారిశుద్ధ్యం పనులు లోపించాయని విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఎక్కడ ఏం చేస్తున్నారో ఎలా చేస్తున్నారో అధికారులకే అంతు పట్టడం లేదు. ఉన్నతాధికారులు నిఘా వేసి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.