పీలేరులో RTC బస్సులను తిరిగి నడపాలి: NSUI
అన్నమయ్య: పీలేరు పట్టణంలో ఆర్టీసీ బస్సులు తిరిగి నడపాలని కోరుతూ NSUI రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దెల అమృత్ తేజ ఆధ్వర్యంలో డిపో ముందు శనివారం నిరసన తెలిపారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనుల వల్ల బస్సులు పట్టణంలోకి రాకపోవడంతో విద్యార్థులు, ప్రజలు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, పూర్వంలా బస్సులు నడిపి సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.