తాడిపత్రిలో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

తాడిపత్రిలో అభివృద్ధి  పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

ATP: ఎమ్మెల్యే జేసీ అష్మిత్ రెడ్డి ఇవాళ తాడిపత్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు. భగత్‌సింగ్ నగర్, సంజీవ్‌నగర్, శ్రీకృష్ణదేవరాయ విగ్రహం, జయనగర్ కాలనీ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి పైప్‌లైన్ పనుల కోసం మొత్తం రూ. 1.25 కోట్లకు పైగా నిధులు కేటాయించినట్లు ఆయన తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు కలిసి శిలాఫలకాలను ఆవిష్కరించారు.