బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లలను పరిశీలించిన MLA

BPT: సూర్యలంకలో జరగనున్న బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లను గురువారం ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు పరిశీలించారు. ఈ నెల 26, 27, 28 తేదీల్లో మూడు రోజుల పాటు ఈ బీచ్ ఫెస్టివల్ జరగనుంది. కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. పారిశుద్ధ్యం, తాగునీటి సౌకర్యాలను పర్యవేక్షించాలని సూచించారు.