నేటితో పాత గుట్ట ఆలయంలో ముగియనున్న అధ్యాయనోత్సవాలు

BHNG: యాదగిరిగుట్టలో గల పాతగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కొనసాగుతున్న అధ్యయనోత్సవాలు నేటితో ముగియనున్నాయి. పురప్పాట్టు సేవ, శ్రీరామానుజాచార్య తిరుమంజనము, నూత్తందాది శాత్తుమొరై పూజలతో ఉత్సవాలు పరిసమాప్తి కానున్నాయి. పాత గుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో జరుగుతున్న అధ్యయనోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.