శ్రీవారిని దర్శించుకున్న జిల్లా టీడీపీ అధ్యక్షుడు
అనంతపురం జిల్లా TDP అధ్యక్షుడు, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ పూల నాగరాజు బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ ప్రోటోకాల్ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న ఆయనకు వేద పండితులు ఆశీర్వచనాలు పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు స్వామివారు మరింత ఆత్మస్థైర్యం ప్రసాదించాలని మొక్కుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.