బకాయిలు చెల్లించకపోతే ఇంటికి తాళమే..!
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో ఆస్తిపన్ను బకాయిలు చెల్లించని వారి ఇళ్లకు, వ్యాపార సముదాయాలకు తాళం వేస్తామని మున్సిపల్ కమిషనర్ షేక్ మహమూద్ హెచ్చరించారు. నోటీసులు జారీ చేసినా స్పందించని రాయల్ ఫంక్షన్ హాల్‌ను సోమవారం లాక్ చేసి సీజ్ చేశారు. ప్రతి ఒక్కరూ ఆస్తిపన్ను బకాయిలను సకాలంలో చెల్లించాలని ఆయన కోరారు.