జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేసిన సీపీ

జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేసిన సీపీ

HYD: KPHB జాతీయ రహదారిపై సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి ఆకస్మికంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. రోడ్లపై తోపుడు బండ్లు పెట్టి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పలు ప్రాంతాల్లో పర్యటించి రాజీవ్ సర్కిల్‌కు వెళ్లారు. అయితే, సీపీ వెళ్లిన కొద్దిసేపటికే మళ్లీ యథావిధిగా వాహనాలను నిలపడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.