పేపర్​ ప్లేట్స్​ దుకాణంలో అగ్నిప్రమాదం

పేపర్​ ప్లేట్స్​ దుకాణంలో అగ్నిప్రమాదం

NZB: నగరంలోని ఓ పేపర్​ప్లేట్స్​ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 4వ టౌన్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని భవానీ పేపర్​ ప్లేట్స్ దుకాణంలో నేడు షార్ట్​సర్క్యూట్​ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో షాప్​లో ఉన్న పేపర్​ ప్లేట్లు, ఇతర వస్తువులు తగలబడడంతో భారీగా నష్టం వాటిల్లింది. అగ్నిమాపక సిబ్బంది శంకర్​, మధు తదితరులు ఫైరింజన్​తో మంటలను అర్పివేశారు.