లింగాల మండలంలో లండన్ మహిళా శాస్త్రవేత్త
KDP: లింగాల మండలం అక్కులుగారిపల్లెలో రైతు ఉదయ్ కృష్ణారెడ్డి పొలాన్ని శుక్రవారం లండన్ దేశానికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ నటాశా ఎడ్వార్డ్ సందర్శించారు. ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాన్ని పరిశీలించి, ప్రకృతి కషాయాల ద్రావణాలు, గ్రోత్ ప్రమోటర్స్, బయో ఎంజైమ్స్, వర్మీ వాష్, వివిధ రకాల విత్తనాలు, వాటి వల్ల ఉపయోగాలను ఆమె అడిగి తెలుసుకున్నారు.