రాయదుర్గం ప్రైమరీ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే
అనంతపురం: రాయదుర్గం పట్టణంలోని పై తోట వద్ద ఉన్న భక్తకన్నప్ప ప్రైమరీ పాఠశాలను ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఆయన మధ్యాహ్న భోజనాన్ని తిని నాణ్యతను పరిశీలించారు.