చంద్రగిరిలో రెచ్చిపోతున్న పెట్రోల్ దొంగలు
TPT: చంద్రగిరిలో పెట్రోల్ దొంగలు చెలరేగిపోతున్నారు. చంద్రగిరితో పాటు శివారులోని పంచాయతీలలో ఇళ్ల ముందు ఉంచిన వాహనాల్లో పెట్రోల్ దోచేస్తున్నారు. సోమవారం సుమారు మూడు ఇళ్ల వద్ద ఉంచిన వాహనాల్లో పెట్రోల్ కాజేసిన ఘటన సీసీటీవీలో రికార్డ్ అవ్వగా అది కాస్త వైరల్ అయ్యింది.పెట్రోలు బదులు వాహనాలను కొట్టేయకముందే పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.