ఘనంగా పదవీ విరమణ వీడ్కోలు
NRPT: దామరగిద్ద మండలం మొగల్ మడక జడ్పీ పాఠశాల ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు బనదయ్య పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి హాజరైన డీఈవో గోవిందరాజులు, ఎంఈవో కృష్ణారెడ్డి ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు. సర్పంచ్ రాములు, తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని బనదయ్యను సన్మానించి వీడ్కోలు పలికారు.