'షో మ్యాన్'గా రాబోతున్న RGV
దర్శకుడు రాంగోపాల్ వర్మ టైటిల్ రోల్‌లో నటిస్తోన్న సినిమా 'షో మ్యాన్'. 'మ్యాడ్ మాన్‌స్టర్' ట్యాగ్‌లైన్. కొత్త దర్శకుడు నూతన్ ఈ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం కాబోతున్నాడు. ఇందులో సీనియర్ నటుడు సుమన్ విలన్‌గా కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి RGV పోస్టర్ విడుదలైంది. ఇక 2026 సంక్రాంతికి దీని ట్రైలర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.