VIDEO: ధర్నా చౌక్ వద్ద రెడ్డి సంఘాల నిరసన
హైదరాబాద్‌లోని ధర్నా చౌక్ వద్ద తెలంగాణ రాష్ట్ర రెడ్డి సంఘాలు నిరసన దీక్ష నిర్వహించాయి. రెడ్డి కులస్థుల సంక్షేమం కోసం రెడ్డి కార్పొరేషను తక్షణమే ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. దీంతో పాటు, రాష్ట్రంలో నిర్వహించే అన్ని పోటీ పరీక్షలలో అభ్యర్థుల కోసం వయోపరిమితిని సడలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.