కూలీలకు అవగాహన కల్పించిన షీ టీం

కూలీలకు అవగాహన కల్పించిన  షీ టీం

SDPT: హుస్నాబాద్ మండలం పందిళ్ళ గ్రామంలో సోమవారం ఉపాధి హామీ కూలీలకు సిద్దిపేట షీ టీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు వేధింపులకు గురైతే ఎటువంటి ఆందోళన చెందకుండా వెంటనే షీ టీంను సంప్రదించాలని అధికారులు సూచించారు. కార్యక్రమాల్లో భాగంగా ఈవ్ టీజింగ్, సైబర్ నేరాలు, పోక్సో చట్టం, 100/1930 హెల్ప్‌ లైన్ నంబర్ల వాడకంపై అవగాహన కల్పించారు.