నిప్పంటుకొని.. చిన్న పలుగు గుట్ట దహనం

నిప్పంటుకొని.. చిన్న పలుగు గుట్ట దహనం

MBNR: ఉర్కొండ మండలం ఇప్పపహాడ్, నాగర్‌కర్నూలు, వెల్దండ మండలం రాచూరు గ్రామ సరిహద్దుల్లోని చిన్న పలుగు గుట్ట వద్ద ఆదివారం ఉదయం నిప్పంటుకోవడంతో గుట్టపై మంటలు వ్యాపించాయి. దీంతో చుట్టుపక్కల రైతులు తమ పంట పొలాల వైపు రాకుండా అదుపు చేశారు. ఎలాంటి ఆస్తి నష్టం జరగకపోయినా.. చిన్న పలుగు గుట్టలో పశువులు మేసే గడ్డి పూర్తిగా దగ్ధమైందని రైతులు తెలిపారు.