సానిటరీ ఇన్‌స్పెక్టర్‌కు మెట్టుగుట్ట వాసుల వినతిపత్రం

HNK: కాజీపేట మండలం మడికొండ మెట్టు రామలింగేశ్వర స్వామి కాలనీవాసులు సోమవారం మున్సిపల్ సానిటరీ ఇన్‌స్పెక్టర్ రవీందర్‌కు వినతి పత్రం సమర్పించారు. కాలనీలో ఖాళీ ప్లాట్ల వల్ల కలుగుతున్న ఇబ్బందులపై చర్చించారు. ప్లాట్ల యజమానులకు నోటీసులను జారీ చేసి వెంటనే నివారణ చర్యలు చేపడుతామని సానిటరీ ఇన్‌స్పెక్టర్ హామీ ఇచ్చారు.