ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య

MBNR: బాలానగర్ మండల కేంద్రంలో గురువారం మధ్యాహ్నం విషాద ఘటన చోటుచేసుకుంది. ఎస్సై లెనిన్ తెలిపిన వివరాల ప్రకారం.. యూపీ రాష్ట్రానికి చెందిన శివ ప్రతాప్ (26) ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రేమించిన అమ్మాయి మాట్లాడడం లేదని యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.