ఏకగ్రీవంగా ఎన్నికైన వార్డు మెంబెర్‌కు సన్మానం

ఏకగ్రీవంగా ఎన్నికైన వార్డు మెంబెర్‌కు సన్మానం

RR: చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి మండలం పర్వేద గ్రామ 1వ వార్డు మెంబెర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన రవిని శంకర్ పల్లి మండలం మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ కాశెట్టి చంద్ర మోహన్ శాలువా కప్పి సన్మానించి, అభినందనలు తెలిపారు. గ్రామాభిరుద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రఘునందన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, రాజేశ్వర్ గౌడ్, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.