నిప్పుతో చెలగాటం ఆడొద్దు: ధోనీ

నిప్పుతో చెలగాటం ఆడొద్దు: ధోనీ

ఓ వివాహ వేడుకలో పాల్గొన్న M.S. ధోనీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. పెళ్లి చేసుకోవడం అంటే నిప్పుతో చెలగాటం ఆడటమేనని ధోనీ సరదాగా వ్యాఖ్యానించాడు. భార్యలకు తమ భర్తలు వరల్డ్ కప్ గెలిచారా? లేదా? అనే విషయం అస్సలు పట్టదని అన్నాడు. అలాగే, భర్తల కోపం కేవలం 5 నిమిషాల్లోనే చల్లారిపోతుందని, అప్పటివరకు భార్యలు మౌనంగా ఉంటే సరిపోతుందని తెలిపాడు.