రైతులకు పరిహార చెక్కులు పంపిణీ

రైతులకు పరిహార చెక్కులు పంపిణీ

అన్నమయ్య: ప్రభుత్వ విప్ ఆరవ శ్రీధర్, ముక్కా వరలక్ష్మి రైల్వే కోడూరు మండలంలోని కుక్కలదొడ్డి గ్రామంలో ఏనుగులు, పందుల దాడితో పంటలు నష్టపోయిన రైతులకు పరిహార చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. రైతుల ఇబ్బందులను ప్రభుత్వం గమనించి ఆర్థిక సహాయం అందిస్తోందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అటవీశాఖ అధికారులతో సమన్వయం చేసుకుని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.