అందుబాటులో ఉంటా సమస్యలు పరిష్కరిస్తా: ఎమ్మెల్యే

KDP: కడప ప్రజలకు సుపరిపాలన అందించేందుకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటానని వారి సమస్యలను పరిష్కరిస్తామని కడప ఎమ్మెల్యే మాధవి పేర్కొన్నారు. గురువారం కడప నగరంలోని రాజారెడ్డి వీధిలో 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. కడపను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామన్నారు.