సిరికొండలో విద్యుత్ పనులు వేగ వంతం
NZB: సిరికొండ మండలంలోని పాకాల, రామడుగు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. విద్యుత్ తీగలపై చెట్లు పడటంతో పలుచోట్ల స్తంభాలు విరిగిపోయాయి. మంగళవారం ఏఈ శివకుమార్ ఆధ్వర్యంలో విద్యుత్ సిబ్బంది యుద్ధ ప్రతిపాదికన మరమ్మతులు చేపట్టారు. విరిగిన స్తంభాల స్థానంలో కొత్తవి వేయించి, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు.