అక్రమ గంజాయి రవాణా.. ముగ్గురు పై కేసు నమోదు
WGL: జిల్లా నక్కలపల్లి గ్రామ సమీపంలోని చెరువుగట్టు వద్ద అక్రమ గంజాయి రవాణా జరుగుతుందనే సమాచారం మేరకు నిన్న రాత్రి డ్రగ్స్ కంట్రోల్ టీం&పోలీసులు సంయుక్తంగా ఆకస్మిక దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో ముగ్గురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి 140 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని..కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.