VIDEO: మిట్టదొడ్డిలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన

VIDEO: మిట్టదొడ్డిలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన

GDWL: గట్టు మండలం మిట్టదొడ్డి గ్రామ శివారులోని శివాలయంలో ఆదివారం ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య మహిళలు మంగళహారతులు ఇచ్చి, మంగళ వాయిద్యాల నడుమ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ గద్వాల ఇంఛార్జ్ బాసు హనుమంతు నాయుడు హాజరై కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు చేసి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు.