కొనసాగుతున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమం

VZM: జామి మండలంలోని లోట్లపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ జోరుగా కొనసాగుతోంది. సచివాలయం సిబ్బంది వేకువ జామున లేచి ఇంటింటికి వెళ్లి పెన్షన్ దారులకు పింఛన్ పంపిణీ చేశారు. అర్హులైన వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందని వెల్ఫేర్ అసిస్టెంట్ హరి తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు జెన్నెల రాధాకృష్ణ పాల్గొన్నారు.