చిత్తూరు కలెక్టరేట్‌లో అర్జీలు స్వీకరణ..!
CTR: చిత్తూరు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లా స్థాయి అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సంబంధిత శాఖ అధికారులు ప్రజల నుంచి వస్తున్న ప్రతి ఫిర్యాదును పరిశీలించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.