కామారెడ్డి టీఎన్జీవోస్ సభ్యత్వ నమోదు
KMR: జిల్లా వ్యవసాయ శాఖ ఫోరంలో టీఎన్జీవోస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. వ్యవసాయ శాఖ లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు టీఎన్జీవోస్ సభ్యత్వాన్ని తీసుకున్నారు.ఉద్యోగులు మాట్లాడుతూ.. 80 ఏళ్ల చరిత్ర కలిగి ఉద్యోగుల సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్న టీఎన్జీఓస్ సంఘంలో సభ్యత్వం తీసుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.