'అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి'

NGKL: పాలకుల నిర్లక్ష్యం, పట్టింపులేని అధికార యంత్రాంగంతో నాగర్‌కర్నూల్ జిల్లాలో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పట్టణ సమీపంలోని కేసరిసముద్రం చెరువుపై నిర్మించిన బ్రిడ్జి నాణ్యత లేకపోవడంతో శుక్రవారం ఓ లోడుతోవస్తున్న లారీ బ్రిడ్జిపై ఒరిగిపోయింది. అదృష్టవశాత్తు డ్రైవర్ చాకచక్యం చూపడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఇకనైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.