డిస్మిస్‌పై మండిపడ్డ APGEF ఛైర్మన్
GNTR: APGEF ఛైర్మన్ కాకర్ల వెంకట్ రామి రెడ్డిపై ప్రభుత్వం తీసుకున్న డిస్మిస్ చర్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబు తన పుట్టినరోజు కానుకగా డిస్మిస్ చేశారని ఆయన ఆరోపించారు. సాధారణంగా సీఎంలు ఉద్యోగులకు మేలు చేస్తారని, కానీ తనపై కక్షపూరితంగా చర్యలు తీసుకున్నారని అన్నారు.