అగ్నిప్రమాద స్థలాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

అగ్నిప్రమాద స్థలాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

HNK: గీసుకొండ మండలం మొగిలిచర్ల గ్రామంలో మంగళవారం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి జరిగిన అగ్నిప్రమాద స్థలాన్ని సందర్శించి, కాలిపోయిన మొక్కజొన్నలను, ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి వారిని ఓదార్చారు. నష్టపోయిన రైతులకు అన్ని విధాలుగా సహాయం చేస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.