తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా ఏజెన్సీ బస్సులు నిలిపివేత
తూ.గో: ఏజెన్సీ ప్రాంతాలకు బస్ సర్వీసులు నిలిపివేస్తున్నట్లు గోకవరం ఆర్టీసీ డిపో మేనేజర్ సుచరిత మార్గరెట్ బుధవారం తెలిపారు. తుఫాను కారణంగా ఈదురుగాలితో కూడిన భారీ వర్షాలు నేపథ్యంలో, రంపచోడవరం, మారే డుమిల్లి, నుంచి ఘాట్ రోడ్డు మీదగా వెళ్లే భద్రాచలం చిత్తూరు, కూనవరం, బస్ సర్వీసులను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిలిపివేయడం జరిగిందని ఆమె తెలిపారు.