కాంగ్రెస్‌ బలోపేతానికి సేవాదళ్‌ కీలకం: జీవన్ రెడ్డి

కాంగ్రెస్‌ బలోపేతానికి సేవాదళ్‌ కీలకం: జీవన్ రెడ్డి

జగిత్యాల: గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో సేవాదళ్ పాత్ర కీలకమని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల ఇందిరా భవన్‌లో టీపీసీసీ సేవాదళ్ సెక్రటరీ బోగోజి ముఖేష్ ఖన్నా ఆధ్వర్యంలో నిర్వహించిన సేవాదళ్ ఆన్‌లైన్ సభ్యత్వ కార్యక్రమాన్ని ఆయన, డీసీసీ అధ్యక్షుడు నందయ్యతో కలిసి ప్రారంభించారు.