ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన సబ్ కలెక్టర్
KMR: పిట్లంలోని ప్రభుత్వ ఆసుపత్రిని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆసుపత్రిలోని వార్డులను తనిఖీ చేసి, రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రిజిస్టర్లను పరిశీలించి సిబ్బంది హాజరును తనిఖీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.