రోడ్డుపై చేరిన మురుగు నీరు

రోడ్డుపై  చేరిన మురుగు నీరు

VSP: నగరంలోని కీలకమైన వైఎంసీఏ బీచ్ రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తోంది. డ్రైనేజీ నిర్వహణ లోపం వల్ల మురుగునీరు రోడ్లపైకి చేరడంతో తీవ్ర దుర్వాసన వెలువడుతోంది. అటు మత్స్యదర్శిని వెనుక భాగంలోనూ ఇదే పరిస్థితి. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే బాటసారులు, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణమే సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.