బైకు అదుపుతప్పి ఇద్దరికీ తీవ్ర గాయాలు

బైకు అదుపుతప్పి ఇద్దరికీ తీవ్ర గాయాలు

SRD: కంగ్టి మండలం రాజారంతాండ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. సిద్ధంగిర్గా గ్రామానికి చెందిన కృష్ణ, గణపతి కంగ్టిలోని వెల్డింగ్ షాపులో పని ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా, బైకు అదుపు తప్పి కిందపడింది. రక్తస్రావమైన వారిని చికిత్స కోసం 108లో ఖేడ్ ఆస్పత్రికి తరలించినట్లు ఈఎంటీ తెలిపారు.