ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాడాలి
E.G: దళిత బహుజన గిరిజనులందరూ మోదీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాటం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తాటిపాక మధు పిలుపునిచ్చారు. అప్పుడే కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి వస్తుందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సామాజిక న్యాయం ఆత్మగౌరవం జన గణనలో కుల గణన చేపట్టాలని కోరుతూ.. సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహంచారు.