'ఓటరు జాబితా సవరణకు పార్టీల సహకారం అవసరం'
BHPL: జిల్లాలో త్వరలో చేపట్టనున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR)కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ రాహుల్ శర్మ కోరారు. ఇవాళ ఐడీఓసీ కార్యాలయంలో MRO, రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. BLO ప్రతి ఇంటిని కనీసం మూడు సార్లు సందర్శించి ఓటర్ల వివరాలు సరిచేస్తారని తెలిపారు.