ఆదర్శప్రాయుడు వాల్మీకి మహర్షి: మాజీ ఎంపీపీ
MBNR: రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి యావత్ మానవాళికి ఆదర్శప్రాయుడని అడ్డాకుల మండల మాజీ ఎంపీపీ నాగార్జున రెడ్డి అన్నారు. వాల్మీకి మహర్షి జయంతి పురస్కరించుకుని మండల పరిధిలోని పొన్నకల్ గ్రామంలో వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ కో ఆప్షన్ సభ్యులు మహమూద్, నాయకులు, మాజీ సర్పంచ్ విజయకుమార్ రెడ్డి పాల్గొన్నారు.