ఈనెల 27న నంద్యాలలో దివ్యాంగులకు క్రీడా పోటీలు
నంద్యాల శివారులోని నవజీవన్ బధిరుల పాఠశాల వద్ద ఈ నెల 27న దివ్యాంగుల కోసం లాంగ్‌జంప్, షాట్‌పుట్, బ్యాడ్మింటన్, పవర్‌లిఫ్టింగ్, వాలీబాల్ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎంఎన్వీ రాజు తెలిపారు. డిసెంబర్ 3 ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈ పోటీలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.