వదిన గొంతు కోసిన మరిది

ప్రకాశం: బ్లేడుతో ఓ వ్యక్తి మహిళ గొంతు కోసిన ఘటన కనిగిరి పట్టణంలో శుక్రవారం రాత్రి జరిగింది. గార్లపేట రహదారిలోని హోటల్లో టిఫిన్ చేస్తున్న పోలా కోటేశ్వరమ్మ అనే మహిళను మరిది ఆంథోనీ అనే వ్యక్తి బ్లేడుతో గొంతు కోసి గాయపరిచాడు. బంధువులు ఆమెను వెంటనే పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సీఐ ఖాజావలి, ఆసుపత్రికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.