VIDEO: ఇల్లందలో కోతుల బెడదకు వినూత్న పరిష్కారం

VIDEO: ఇల్లందలో కోతుల బెడదకు వినూత్న పరిష్కారం

WGL: వర్ధన్నపేట మండలం ఇల్లందలో కోతుల బెడద తీవ్రంగా పెరిగింది. ఇళ్లలోకి చొరబడి దాడులు చేయడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ పరిస్థితిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో గురువారం సర్పంచ్ బేతి సాంబయ్య ఆలోచనతో పంచాయతీ సిబ్బంది చింపాంజీ వేషాలు ధరించి కోతులను భయపెట్టే చర్యలు చేపట్టారు. ఈ వినూత్న ప్రయత్నంతో కోతుల బెడద తగ్గడంతో గ్రామస్తులు ఊరట పొందారు.