VIDEO: ట్రాక్టర్ బ్యాటరీలు ఎత్తుకెళ్లిన దుండగులు
BHNG: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో సోమవారం తెల్లవారుజామున దొంగలు హల్‌చల్ చేశారు. ఇంటి ముందు పార్క్ చేసి ఉంచిన వ్యవసాయ ట్రాక్టర్లలోని బ్యాటరీలను గుర్తుతెలియని దొంగలు ఎత్తుకుపోయారు. దీంతో ఉదయం విషయం తెలిసిన యజమానులు షాక్‌కు గురయ్యారు. వెంటనే చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.